ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివరాత్రి వరకూ వైద్యానికి వెళ్లం!

ABN, First Publish Date - 2021-03-06T05:26:56+05:30

ఆధునిక యుగంలోనూ ఆది వాసీలు మూఢనమ్మకాలను వీడడం లేదు. పాము కుట్టినా శివరాత్రి వరకు వైద్యానికి ఆస్పత్రికి వెళ్లబోమ ని, తాము పామును దైవంగా భావిస్తామని చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూఢ నమ్మకాన్ని వీడని గిరిజనులు 

పాము కుట్టినా... వైద్యం చేయించుకోని వైనం

వైద్యులు కౌన్సెలింగ్‌ చేసినా ఫలితం శూన్యమే! 

ఉట్నూర్‌, మార్చి 5: ఆధునిక యుగంలోనూ ఆది వాసీలు మూఢనమ్మకాలను వీడడం లేదు. పాము కుట్టినా శివరాత్రి వరకు వైద్యానికి ఆస్పత్రికి వెళ్లబోమ ని, తాము పామును దైవంగా భావిస్తామని చెబుతున్నారు. ఉట్నూర్‌ మండలం హీరాపూర్‌కు చెందిన ఆదివాసీ బాలిక (14)కు రెండు నెలల క్రితం పాము కాటు వేయడంతో దంతన్‌పల్లి పీహెచ్‌సీకి తరలించి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్యం అం దించారు. అయితే కేవలం మూడు రోజుల పాటు వై ద్యం అందుకున్న గిరిజనులు తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ పాము కుట్టిన చోట గాయం పెరిగి కా లు వాపురావడంతో వైద్య సిబ్బంది బాలిక ఇంటి వద్దకే వెళ్లి వైద్యం చేస్తూ వస్తున్నారు. అయినా వాపు తగ్గకపోవడంతో దంతన్‌పల్లి డాక్టర్‌ అనురాధ ఆస్ప త్రికి రావాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ మనోహర్‌తో కలిసి డాక్టర్‌ కోవ అనురాధ మరోసారి బాలిక తండ్రి యశ్వంత్‌రావును ఒప్పించే ప్రయత్నం చేశా రు. తల్లిదండ్రులను కౌన్సెలింగ్‌ చేయగా శివరాత్రి పం డుగ సమీపిస్తున్నందున తాము పామును దైవంగా కొలుస్తామని పండుగ తర్వాత ఆస్పత్రికి వస్తామని తల్లిదండ్రులు పేర్కొనడంతో చేసేదేమీ లేక అధికారులు సైతం వెనుదిరిగారు.

Updated Date - 2021-03-06T05:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising