ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ABN, First Publish Date - 2021-09-18T03:57:19+05:30

పోలీస్‌ చర్యతో నిజాం రాక్షస పాల న అంతమై ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమైందని హిందువాహిని, ఆదర్శ భారతీయన్‌ నాయకులు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐబీ చౌరస్తా నుంచి అర్చన టెక్స్‌ చౌరస్తా వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.

జాతీయ జెండాను అవిష్కరించి వందనం చేస్తున్న బిజెపి నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, సెప్టెంబరు 17: పోలీస్‌ చర్యతో నిజాం రాక్షస పాల న అంతమై ఇండియన్‌ యూనియన్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ విలీనమైందని హిందువాహిని, ఆదర్శ భారతీయన్‌ నాయకులు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐబీ చౌరస్తా నుంచి అర్చన టెక్స్‌ చౌరస్తా వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. రాజాకర్లను తుదముట్టించి నిజాం పాలనకు చరమగీతం పాడిన సర్దార్‌ పటేల్‌ దూర దృష్టికి, దేశభక్తికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. కొట్టె నటేశ్వర్‌, తౌటం సాయి, తోట కార్తీక్‌, సోమ ప్రదీప్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు. 

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి వల్లే తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అన్నారు. అర్చన టెక్స్‌ చౌరస్తాలో  జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించినప్పటికి తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన కొనసాగిందన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నిజాం సేనల్ని ఓడించి హైదరాబాద్‌ స్టేట్‌ను ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేశారన్నారు. వెంకటేశ్వర్‌రావు, ప్రభాకర్‌, రవీందర్‌రావు, వాణి, వెంకటకృష్ణపాల్గొన్నారు. 

 

Updated Date - 2021-09-18T03:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising