ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల దాహార్తి తీర్చేందుకు గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటి విడుదల

ABN, First Publish Date - 2021-04-11T06:11:01+05:30

సుద్దవాగు పరివాహక ప్రాంతాల్లోని పశువుల దాహార్తిని తీర్చేందుకు, చివరిదశలోనున్న పంటలకు తడులు అందించేందుకు గాను గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లుగా ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వెల్లడించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న ముథోల్‌ ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా, ఏప్రిల్‌ 10 : సుద్దవాగు పరివాహక ప్రాంతాల్లోని పశువుల దాహార్తిని తీర్చేందుకు, చివరిదశలోనున్న పంటలకు తడులు అందించేందుకు గాను గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లుగా ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వెల్లడించారు. శనివారం గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద గేట్‌ నుంచి సుద్దవాగులోకి నీటిని విడుదల చేసిన సందర్బంగా స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సుద్దవాగు పరివాహక ప్రాంత రైతుల విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులకు సమస్యను వివరించి ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు చర్యలు చేపట్టామన్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోయి నీటి ఇబ్బందులు అధికమయ్యా యన్నారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఎండిపోయి సమస్యలు పెరిగాయన్నారు. సంబంధిత సమస్యల పరిష్కారం కోసం గాను ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో నీటిపారుదలశాఖ ఈఈ రామరావ్‌తో పాటు గడ్డెన్నవాగు ప్రాజెక్టు అధికారులు, పట్టణ, డివిజన్‌ పరిధి లోని ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-11T06:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising