ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం

ABN, First Publish Date - 2021-05-17T05:53:11+05:30

వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా అడపాదడప వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు తమ పంట పొలాల్లోని పత్తి కట్టెను తీసి వేసి దుక్కులను దున్నించారు.

చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న మహిళా రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, మే16: వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా అడపాదడప వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు తమ పంట పొలాల్లోని పత్తి కట్టెను తీసి వేసి దుక్కులను దున్నించారు. అదేవిధంగా పంట పొలాల్లోని చెత్తా చెదా రాన్ని తొలగించి పొలంలోనే తగలబెడుతున్నారు. జూన్‌ సమీపిస్తుండడంతో రైతులు పంటను పండించేందుకు సిద్ధమవుతున్నారు. అక్షయ తృతీయ రోజున విత్త నాలను సైతం రైతులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చారు. మరికొంత మంది రైతులు ఎరువులను కూడా సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. ఈ సంవత్సరం పంటలను పండించేందుకు రైతన్నలు సిద్ధం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. మండలంలో  90శాతం మంది రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. 

Updated Date - 2021-05-17T05:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising