ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆత్మహత్యలపై విచారణ జరపాలి

ABN, First Publish Date - 2021-04-16T05:20:11+05:30

రైతు అత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుం బాలకు పరిహారం ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. మండలంలోని కౌఠ-బి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సగ్గిడి సతీష్‌ కుటుంబాన్ని గురు వారం పరామర్శించారు.

బాధిత కుటుంబ వివరాలను సేకరిస్తున్న బొర్రన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15: రైతు అత్మహత్యలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుం బాలకు పరిహారం ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. మండలంలోని కౌఠ-బి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు సగ్గిడి సతీష్‌ కుటుంబాన్ని గురు వారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను సతీష్‌ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఎకరాల సొంత భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడని ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పుల భారం పెరగడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై అత్మహత్య చేసుకున్నట్లు పేర్కొ న్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్‌ 194 ప్రకారం 6 లక్షల రూపాయల పరిహారాన్ని, పిల్లలకు ఉన్నతమైన విద్య, వైద్య సదు పాయాలను కల్పించాలని కుటుంబ యజమాను రాలికి నెలకు 5 వేల రూపాయాల పెన్షన్‌ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-16T05:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising