ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా జాగ్రత్తలపై విస్తృత ప్రచారం

ABN, First Publish Date - 2021-04-12T06:05:03+05:30

జిల్లాలో కరోనా రెండో దశ ఉధృతిపై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆటోల ద్వారా చేసే ప్రచారాన్ని డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలని అన్నారు. పోలీస్‌ శాఖ వైరస్‌ విస్తరించకుండా అవగాహన

నిర్మల్‌ జిల్లాకేంద్రంలో ప్రచారం చేస్తున్న సీఐ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 11: జిల్లాలో కరోనా రెండో దశ ఉధృతిపై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆటోల ద్వారా చేసే ప్రచారాన్ని డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలని అన్నారు. పోలీస్‌ శాఖ వైరస్‌ విస్తరించకుండా అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇందులో టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఎస్సై దయానంద్‌, ఏఎస్సై శ్రీనివాస్‌ వర్మ పాల్గొన్నారు.

సోన్‌: గ్రామాల్లో కొవిడ్‌ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పక పాటించా లని సీఐ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కడ్తాల్‌ గ్రామంలో కోవిడ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు గ్రామాల్లో కరోనా పెరిగిపోతోందని, ప్రజలందరూ మాస్క్‌లు తప్పక ధరించాలన్నారు. కడ్తాల్‌లో స్వచ్ఛందంగా గ్రామస్థులు లాక్‌ డౌన్‌ విధిండచం అభినందనీయమని అన్నారు. 

కుభీర్‌: ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ భౌతికదూరం పాటించాలని డీఎల్‌పీవో శివకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని బాకోట, చొండి, మండల కేంద్రంలోని దుకాణాల్లో, గ్రామస్తులకు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.  

పెంబి: ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ టీకాను వేయించుకోవాలని ఎంపీవో చిక్యాల రత్నాకర్‌ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాపై అవగాహన కల్పించారు.  

తానూర్‌: ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలని ఎస్సై రాజన్న అన్నారు. ఆదివారం మండలంలోని హిప్పెల్లి గ్రామంలో స్థానిక ప్రజలకు కొవిడ్‌-19పై అవగాహన కల్పించారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా గుంపులు గుంపులుగా తిరగవద్దన్నారు. 

కుంటాల: అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్‌019 వ్యాక్సిన్‌ తీసుకోవాలని కుంటాల మండల నోడల్‌ అధికారి (ఎంపీడీవో) దేవెందర్‌రెడ్డి అన్నారు. మండలంలో ఇటీవల కోవిడ్‌ 19 కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా కుంటాల పీహెచ్‌సీతో పాటు కల్లూర్‌ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి కోవిడ్‌ 19 టీకాలను వేసే కార్యక్రమం చేపట్టారు. కాగా, కేసులు పెరుగుతున్న దృష్ట్యా కుంటాలలో ఆదివారం సంత జరగలేదు. ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ నిర్వహించారు. అలాగూ. కుంటాలలో ఆదివారం 34 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రోజు 126 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 34 మందికి పాజిటీవ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-04-12T06:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising