ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి

ABN, First Publish Date - 2021-05-07T05:30:00+05:30

ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించాలని డీఆర్డీఏ పీడీ కిషన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, మే7: ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పని కల్పించాలని డీఆర్డీఏ పీడీ కిషన్‌ అన్నారు. శుక్ర వారం మండలంలోని ఉండం, ఖోడద్‌ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లా డుతూ వేసవి కాలంలో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని సూచించారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం లో 52 రకాల పనులు ఉన్నాయన్నారు. రైతులకు, గ్రామస్థులకు ఉప యోగపడే పనులే చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా ఉపాధి హా మీ పథకం ద్వారా చెరువులోని మట్టిని వ్యవసాయ పొలాల్లో వేసుకుం టే అధిక పంటలు పండుతాయన్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు ఉదయం పూటనే రావాలని కూలీలకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా కూలీలే అరికట్టా లని కోరారు. అనంతరం ఖోడద్‌ పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. మండు వేసవిలోను నిండు పచ్చ దనంతో నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఉందన్నారు. ఈయన వెంట ఎంపీడీవో రమాకాంత్‌, ఏపీవో శ్యాముల్‌, ఖోడద్‌ సర్పంచ్‌ సాకేఆనంద్‌, ఉండం సర్పంచ్‌ నర్సింహులు, పంచాయతీ సెక్రటరీలు, కూలీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising