ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

ABN, First Publish Date - 2021-06-24T07:06:42+05:30

పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు.బుధవారం ప్రభుత్వ బాలికల కళాశాల సమీపంలో వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న దుకాణా సముదాయాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు.బుధవారం ప్రభుత్వ బాలికల కళాశాల సమీపంలో వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న దుకాణా సముదాయాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. అభ్యంతరాలపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారస్థుల కోసం నిర్మిస్తున్న దుకాణాల సముదాయాలపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనధికారికంగా ఆక్రమించిన రోడ్లను, రోడ్లపై నిర్మించిన వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై ఇటుక, కంకర, ఇసుక వంటి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీధి వ్యాపారులకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T07:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising