ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలి..

ABN, First Publish Date - 2021-05-07T04:36:28+05:30

కొవిడ్‌-19 ఇంటింటి జ్వర సర్వేకు ప్రతీఒక్కరూ సహకరించాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు.

కాగజ్‌నగర్‌లో సర్వేను పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-అదనపు కలెక్టర్‌ రాజేశం

కాగజ్‌నగర్‌టౌన్‌, మే 6: కొవిడ్‌-19 ఇంటింటి జ్వర సర్వేకు ప్రతీఒక్కరూ సహకరించాలని అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు. గురువారం పట్టణంలోని ఆయావార్డుల్లో మోప్మా, మున్సిపల్‌ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. జ్వర సర్వేలో కొవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్నట్లయితే ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. అర్హులైన వారంతా భయాన్ని వీడి టీకా వేసుకోవాలని సూచించారు. కొవిడ్‌ లక్షణాలు అధికంగా ఉన్నట్లయితే ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వెద్యం చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మోప్మా సిబ్బంది పాల్గొన్నారు. 

పలువార్డుల్లో హైపోక్లోరైడ్‌ స్ర్పే..

కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో పలు వార్డుల్లో హైపోకోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు ఆయా వార్డుల్లో తిరుగుతూ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న కాలనీల్లో ద్రావణాన్ని స్ర్పే చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T04:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising