ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన ఉండాలి

ABN, First Publish Date - 2021-06-21T06:51:32+05:30

ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు పీపీ మేకల మధుకర్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులందరికి న్యాయవ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, జూన్‌ 20: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు పీపీ మేకల మధుకర్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులందరికి న్యాయవ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టాలపై అవగాహన లేక పోవడంతో మోసపోయే అవకాశం ఉందన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులను ఏర్పాటు చేస్తానన్నారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరరం మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మధుకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడె స్వామి, మండల మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడుగు పొచ్చన్న, ఉపాధ్యక్షులు ఆశన్న, సర్పంచ్‌లు రాజేశ్వర్‌, సంఘం నాయకులు నేతుల గంగన్న, ఎలుగు ఆనంద్‌,  ముత్యాలరవి, ప్రేమేందర్‌, వెంకట్‌స్వామి, చందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising