పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి
ABN, First Publish Date - 2021-07-02T04:42:00+05:30
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఏడోవిడత హరితహారంలో భాగంగా బుధ వారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల ఆవరణలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి మొక్కలునాటారు.
- జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి
ఆసిఫాబాద్, జూలై 1: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఏడోవిడత హరితహారంలో భాగంగా బుధ వారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల ఆవరణలో కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి మొక్కలునాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అడవులశాతాన్ని పెంచేం దుకు హరితహారం కార్యక్రమం చేపడుతోందన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 52.68 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాల న్నారు. డీపీవో శ్రీకాంత్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్, డీఆర్డీవో రవికృష్ణ, డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మనెమ్మ, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-02T04:42:00+05:30 IST