ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటిన ప్రతీ మొక్కను కాపాడాలి

ABN, First Publish Date - 2021-06-18T03:54:41+05:30

హరితాహారం కార్య క్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను కాపాడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. గురువారం క్యాతన్‌పల్లిలోని 10వ వార్డులో సభ్యులు, సిబ్బందిచే నాటిన 200 మొక్కలను పరిశీ లించి మాట్లాడారు. తెలంగాణాకు హరిత హారం అత్యంత ప్రాముఖ్యత సాధించిం దన్నారు.

మొక్కలను పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడుతన్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మందమర్రి, జూన్‌ 17: హరితాహారం కార్య క్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను కాపాడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. గురువారం క్యాతన్‌పల్లిలోని 10వ వార్డులో సభ్యులు, సిబ్బందిచే నాటిన 200 మొక్కలను పరిశీ లించి మాట్లాడారు. తెలంగాణాకు హరిత హారం అత్యంత ప్రాముఖ్యత సాధించిం దన్నారు. అనంతరం మున్సిపా లిటీ పరిధిలో చేపడుతున్న నర్సరీని సందర్శిం చారు. చైర్‌పర్సన్‌ జంగం కళ, కమిషనర్‌ వెంక టనారాయణ, మేనేజర్‌ నాగరాజు, వసంత్‌ వార్డు కౌన్సిలర్‌లు తదితరులు ఉన్నారు.

వేమనపల్లి: నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకో వాలని ఎంపీడీవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం బుయ్యారం గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సేంద్రియ ఎరు వుల తయారీ విధానం పరిశీలించారు. హరిత హారం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు పెరిగేలా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శి రాకేష్‌ ఉన్నారు. 

భీమారం: ఏడవ విడత హరితహారం నిర్వ హణకు సర్పంచులు, కార్యదర్శులు సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో కే. శ్రీనివాస్‌ అన్నారు. గురువారం కొత్తపల్లిలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు హరితహారం కార్యక్రమా నికి ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రభుత్వం ఆదేశించిన వెంటనే మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. 

నర్సరీని పరిశీలించి మొక్క లు పెద్ద సంఖ్యలో ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం  హరితహారం కార్యక్రమం ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపన్న, ఈజీఎస్‌ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T03:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising