ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులందరికీ కనీస సామర్థ్యాలు ఉండేలా చూడాలి

ABN, First Publish Date - 2021-10-24T04:26:39+05:30

జిల్లాలో విద్యా ర్థులందరికీ కనీస సామర్థ్యాలు ఉండేలా చూడాలని అదనపుకలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఎంఈవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, స్కూల్‌కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయు లతో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 23: జిల్లాలో విద్యా ర్థులందరికీ కనీస సామర్థ్యాలు ఉండేలా చూడాలని అదనపుకలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఎంఈవోలు, స్పెషల్‌ ఆఫీసర్లు, స్కూల్‌కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయు లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచే విధంగా ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషిచేయా లన్నారు. మధ్యాహ్నభోజనం నాణ్యతగా అందించాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నా రు. డీఈవో అశోక్‌ మాట్లాడుతూ విద్యా ర్థుల్లో నైపుణ్యం పెంపొందించి ఫలితాలను ఫలితాలను అకడమిక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని అన్నారు. పరీక్షల సహాయ కమిషనర్‌ ఉదయ్‌బాబు మాట్లాడుతూ ఎన్‌ఎం ఎంఎస్‌, ఎన్‌టీ ఎస్‌ఈ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. డీసీఈబీ కార్య దర్శి వెంకటేశ్వరస్వామి, జిల్లాసైన్స్‌అధికారి, ఇంక్లూజివ్‌ ఎడ్యూ కేషన్‌ కోఆర్డినేటర్‌ సత్తయ్య, క్వాలిటీ కోఆర్డినే టర్‌ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ..

స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌కు సంబం ధించిన పోస్టర్లను శనివారం ఆసిఫాబాద్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే విధంగా చదువులు ఉండాలన్నారు. ఉపాధ్యాయులకు మాత్రమే విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీసే అవకాశం ఉంటుందన్నారు.

డీఈవో అశోక్‌ మాట్లాడుతూ ఈనెల16నుంచి 24వరకు టీచర్స్‌ నామినేషన్‌ ప్రక్రియ, 25నుంచి నవంబరు 12వరకు ఆన్‌లైన్‌ శిక్షణ, 13నుంచి 18వరకు ఆన్‌లైన్‌ కోర్సు, రిజిస్ట్రేషన్‌ ప్రకియ కొనసాగు తాయ న్నారు. స్టూడెంట్స్‌ రిజిస్ట్రేషన్‌, ఐడియా సబ్మిషన్‌ నవంబరు 13నుంచి 19వరకు ఉంటుందన్నారు. మూల్యాంకన ప్రక్రియ నవంబరు 13నుంచి 31వరకు ఉంటుందన్నారు. జిల్లాసైన్స్‌ అధికారి మధుకర్‌, పరీ క్షల సహాయ కమిషనర్‌ ఉదయ్‌బాబు, కోఆర్డినేటర్‌ సత్యనారాయణమూర్తి, సత్తయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising