ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కులను సాధించుకున్నప్పుడే సాధికారత

ABN, First Publish Date - 2021-03-07T04:42:11+05:30

భారత రాజ్యాంగం, ప్రభుత్వాలు కల్పించిన హక్కులను సాధించుకునప్పుడే మహిళలు సాధికారత సాధిస్తారని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకురాలు టీచర్‌ సురేఖ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు.

కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి6: భారత రాజ్యాంగం, ప్రభుత్వాలు కల్పించిన హక్కులను సాధించుకునప్పుడే మహిళలు సాధికారత సాధిస్తారని  టీఎస్‌యూటీఎఫ్‌ నాయకురాలు టీచర్‌ సురేఖ అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన న్యాయవాది రజితతో పాటు ఉపాధ్యాయురాలు సురేఖ మా ట్లాడారు. సమాజంలో మహిళలు, యువతులు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. హక్కులు, చట్టాలు ఉన్న అవి పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మహిళలకు కల్పించిన చట్టాలను పకడ్బందీగా అము చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు, యువతులు, బాలికల పై జరుగుతున్న లైంగిక దాడులతో పాటు వేధింపులను అరికట్టి రక్ష ణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు.  వీటన్నింటిని సాధించుకోవాలంటే మహిళలు మరింత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కోవశకుంతల, లంకజమున, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు సునీత, ఆశాజిల్లా యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు రాధా, శోభ, ఎన్‌పీఆర్డీ జిల్లా కార్యదర్శి ఆరీఫా, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేయాలి..

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్‌ టీయూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహిస్తున్న మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని టీయూటీఎఫ్‌ మహిళ సభ్యులు, టీయూటీఎఫ్‌జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు స్థానిక సంఘ భవనంలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ధైర్యంగా ముందడుగు వేయాలి

సమాజంలో మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులకు భ యపడకుండా మహిళలు, యువతులు ధైర్యంగా ముందడుగు వేయాలని మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ డా.మిల్క తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో పలువురు విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులను ప్రదానం చేశారు. సకీ సెంటర్‌ నిర్వాహకురాలు యశోద మాట్లాడుతూ.. మహిళలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 100, 1098, 181 కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు

మహిళ హక్కులపై అవగాహన అవసరం

బోథ్‌: మహిళలకు ఉన్న హక్కుల గురించి అవగాహన అవసరమని బోథ్‌ మున్సిపల్‌ మెజిస్ర్టేట్‌ పీబీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. బోథ్‌లోని కోర్టు ఆవరణలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళ పాత్ర వారికి ఉన్న చట్టాలు తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాది పి.ఆడేపు హరీష్‌,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T04:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising