ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వృద్ధ దంపతులు

ABN, First Publish Date - 2021-06-22T06:01:37+05:30

భూ సమస్య పరిష్కరించాలంటూ వృద్ధ దంపతులు పురుగు మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చిన సంఘటన ఆదిలాబాద్‌లో సోమవారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ 

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 21: భూ సమస్య పరిష్కరించాలంటూ వృద్ధ దంపతులు పురుగు మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చిన సంఘటన ఆదిలాబాద్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బజార్‌హత్నూర్‌ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన చొవ్వాజి రావుజీకి గ్రామ శివారులో గల సర్వే నెంబర్‌ 81లో 4ఎకరాల 30 గుంటల భూమి ఉంది. దశాబ్దాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ రావుజీ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే సంవత్సరం క్రితం గ్రామా నికి చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ కోర్టును, అధికారులను ఆశ్రయించారు. ఈ భూమిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సమస్య పరిష్కరించేంత వరకు ఎవరూ సాగు చేయొద్దని అధికారులు ఇరు వర్గాలకు చెప్పారు. దీంతో ఈ భూమి తనదేనని రావుజీ అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం తన కుటుంబంతో సహా కలెక్టరేట్‌కు వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని భావించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రావూజీ మాట్లాడుతూ.. తన భూమిని కొందరు ఆక్రమించాలని చూస్తున్నారని, అందు వల్లే లేని పోని సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వృద్ధ దంపతులను పోలీసులు కలెక్టర్‌కు కల్పించారు. స్పందించిన కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సంబంధిత ఉన్నతాధికారులను పిలిపించి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని భరోసా కల్పించారు.

Updated Date - 2021-06-22T06:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising