ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా వలంటీర్లను కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-06-21T07:28:50+05:30

రాష్ట్రంలోని 16,000 మంది విద్యా వలంటీర్లను కొనసాగిస్తూ జీవో జారీ చేయాలని జిల్లా విద్యా వలంటీర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గత 16 నెలలుగా ఎలాంటి సహయం అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ టీచర్లను ఆదుకున్న ప్రభుత్వం

నిరసన వ్యక్తం చేస్తున్న విద్యా వలంటీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 20: రాష్ట్రంలోని 16,000 మంది విద్యా వలంటీర్లను కొనసాగిస్తూ జీవో జారీ చేయాలని జిల్లా విద్యా వలంటీర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గత 16 నెలలుగా ఎలాంటి సహయం అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ టీచర్లను ఆదుకున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 21 నుండి పాఠశాలలు ప్రారంభించడానికి నిర్ణయించినందున తమను రెన్యువల్‌ చేసి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఈ మేరకు వారు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. దిగంబర్‌, మధుకర్‌, సురేష్‌తో పాటు విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు. 

మా ఉద్యోగాలను రెన్యూవల్‌ చేయాలి

భైంసా: వచ్చె నెల మొదటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న దృష్యా తమ ఉద్యోగాలను రెన్యూవల్‌ చేయాలని తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం జిల్లా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక వేదం హైస్కూల్‌లో జిల్లా విద్యా వలంటీర్ల సంఘం సమావేశం జరిగింది. ఇందులో సంఘం జిల్లా అద్యక్షులు నామత్కర్‌ దిగంబర్‌ మాట్లాడుతూ కరోనాతో ఉపాది అవకాశాలు లేక విద్యా వలంటీర్ల కుటుంబాలు అర్ధాకాలితో అవస్థలు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. 16 నెలలుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేక బతుకులు అగమ్యగోచరంగా మారాయని వాపోయారు. రాష్ట్ర సర్కార్‌ ప్రైవేట్‌ పాఠశాలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు రూ.2 వేల ఆర్థిక సహాయంతో పాటు బియ్యం అందించి ఆదుకుందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించిన తమను మాత్రం పట్టించుకోకుండా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వలంటీర్లను ఆదుకునేందుకు గాను ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే తమను రెన్యూవల్‌ చేసి వచ్చే నెల 1వ తేదీ నుంచి విధులకు అవకాశం కల్పించాలని, కరోనా కాలానికి సంబంధించి 16 నెలల వేతనాలను అందించాలని కోరారు. ఇందులో జిల్లా పరిధిలోని ఆయా మండలాలకు చెందిన యూనియన్‌ ప్రతినిదులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T07:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising