ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపులో వివక్ష

ABN, First Publish Date - 2021-01-21T04:08:25+05:30

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపు లో వివక్ష చూపుతున్నారని రామగుండం కార్పొరేటర్లు కలెక్టర్‌ భారతి హోళికేరి క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం బైఠాయించారు. పెద్దపెల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తుండడంతో రామగుండం మున్సిపల్‌ కార్పొరేటర్లు బుధవారం సాయంత్రం ఏంసీసీ కాలనీ కలెక్టర్‌ క్యాంపు కార్యాల యానికి వచ్చారు.

మంచిర్యాల కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించిన రామగుండం కార్పొరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించిన రామగుండం కార్పొరేటర్లు


మంచిర్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపు లో వివక్ష చూపుతున్నారని రామగుండం కార్పొరేటర్లు కలెక్టర్‌ భారతి హోళికేరి క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం బైఠాయించారు. పెద్దపెల్లి ఇన్‌చార్జి కలెక్టర్‌గా కూడా వ్యవహరిస్తుండడంతో రామగుండం మున్సిపల్‌ కార్పొరేటర్లు బుధవారం సాయంత్రం ఏంసీసీ కాలనీ కలెక్టర్‌ క్యాంపు కార్యాల యానికి వచ్చారు. వారు మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్‌, 14వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో అధికార పార్టీకి చెందిన మేయర్‌, ఎమ్మెల్యే వివక్ష చూపారని ఆరోపించారు. ఈనెల 23న రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌  సమావేశం ఉందని, ఎజెండాలో వివిధ వార్డులకు సంబంధించిన ఎస్సీ సబ్‌ ప్లాన్‌, 14వ ఆర్థిక సంఘం నిధులను ఎస్సీ రిజర్వేషన్‌ డివిజన్లలో రూ.20 లక్ష లు, ఇతర డివిజన్లలో రూ.30 లక్షలకుపైగా కేటాయించారన్నారు. ఇద్దరు కాం గ్రెస్‌ కార్పొరేటర్ల డివిజన్లలో ఒక్క రూపాయి కేటాయించకపోవడం దళితులను అవమానించినట్లుగా భావిస్తున్నామన్నారు. ప్రజలతో సంబంధం లేని టీఆర్‌ ఎస్‌కు చెందిన కోఆప్షన్‌ మెంబర్‌కు నిధులు ఎలా కేటాయించారో కలెక్టర్‌ విచా రించి చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ విషయమై వినతిపత్రం ఇచ్చేందుకు రాగా కలెక్టర్‌ స్పందించకపోవడంతో బైఠాయించాల్సి వచ్చిందని తెలిపారు.  సమాచారం అందుకున్న పోలీసులు కార్పొరేటర్లు బొంతల రాజేష్‌, గాదం విజ య, పెద్దెల్లి తేజస్విని, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, నగునూరి సుమ లత, కొలిపాక సుజాత, ముదాం శ్రీనివాస్‌, సనా ఫకృద్దీన్‌, దాసరి సావిత్రిలను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. 

Updated Date - 2021-01-21T04:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising