ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం

ABN, First Publish Date - 2021-05-05T05:45:28+05:30

మండలంలోని దేవాపూర్‌ గ్రామ సమీపంలో గల విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని రాగి తీగలను దొంగిలించినట్లు విద్యుత్‌ శాఖ ఏఈ సతీష్‌కుమార్‌ తెలిపారు.

ధ్వంసమైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, మే4: మండలంలోని దేవాపూర్‌ గ్రామ సమీపంలో గల విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని రాగి తీగలను దొంగిలించినట్లు విద్యుత్‌ శాఖ ఏఈ సతీష్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసిందన్నారు. కానీ కొంతమంది గుర్తు తెలియని దొంగలు ఈ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని విలువైన రాగి తీగలు, ఇతర వస్తువులను దొంగలించారన్నారు. దీంతో రైతులకు సాగునీరు అందించడం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రైతులే తమ ట్రాన్స్‌ఫార్మర్లను చూసుకోవాలన్నారు. అంతేకాకుండా రైతులందరు గస్తీగా ఏర్పడి రాత్రిపూట తనిఖీలు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దొంగలించిన ట్రాన్స్‌ఫార్మర్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-05-05T05:45:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising