ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్పీ కార్యాలయం తనిఖీ

ABN, First Publish Date - 2021-10-17T06:34:43+05:30

జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఎస్పీ రాజేశ్‌చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప లు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, పోలీసులు పూర్తిబందోబస్తు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించారని అన్నారు. విధిగా పోలీసు స్టేషన్లలో తనిఖీలు చేపట్టాలని, సిబ్బంది పని తీరు మరింత మెరుగు పరిచే విధంగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పలువురు పోలీసు అధికారులున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు16: జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఎస్పీ రాజేశ్‌చంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప లు రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, పోలీసులు పూర్తిబందోబస్తు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించారని అన్నారు. విధిగా పోలీసు స్టేషన్లలో తనిఖీలు చేపట్టాలని, సిబ్బంది పని తీరు మరింత మెరుగు పరిచే విధంగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పలువురు పోలీసు అధికారులున్నారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల కారణంగా వచ్చే 48 గంటలు జిల్లాలో పోలీసులు అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు. శనివారం పోలీసు అధికారులతో టె లీకాన్ఫరెన్స్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలీసు కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం 8106674510 లేదా డ యల్‌ 100కు సంప్రదించాలని కోరారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు.
ప్రజల్లో భరోసా కల్పించాలి
పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజల్లో భరోసా కల్పించాలని ఎస్పీ అన్నారు. శుక్రవారం పోలీసు పెట్రోల్‌ పంపు నాలుగో వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. పెట్రోల్‌ పంపులో పని చేస్తున్న కార్మికులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నూతన వస్ర్తాలు అందజేశారు. ఏఎస్పీలు శ్రీనివాస్‌రావు, సమైజాన్‌రావు, వినోద్‌కుమార్‌, డీఎస్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising