ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు రాయాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-10-29T05:56:31+05:30

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌ఆర్‌జేసీ బాలుర కళాశాలను సందర్శించి పరీక్షలను పరిశీలించారు.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 28: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌ఆర్‌జేసీ బాలుర కళాశాలను సందర్శించి పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే గురువారం జిల్లా వ్యాప్తంగా 47కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 8,555 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా జనరల్‌ విభాగంలో 6,974, ఒకేషనల్‌ విభాగంలో 862 మొత్తం 7,836 మంది పరీక్షలు రాసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో జనరల్‌ 541, ఒకేషనల్‌ 178 మంది మొత్తం 719 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి రవీంద్రకుమార్‌ ఉన్నారు.

సమీక్షలతో సత్పలితాలు..

ఉట్నూర్‌: జిల్లాలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరును సమీక్షల ద్వారా తెలుసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం రాత్రి స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా, విద్య, వైద్యం, స్వయం ఉపాధి, రోడ్లు, వంతెనలు, భవనాల నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలన్నారు. ఐటీడీఏ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాలని పీవో అంకిత్‌కు సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు అధికారి అంకిత్‌, ఈఈ రాథోడ్‌ భీంరావు, ఏపీవో జనరల్‌ కినక భీంరావు, పరిపాలన అధికారి రాంబాబు, పీవీటీజీ ఎపీవో రమణ, పీఏవో భారతి, డిప్యూటీ ఈఈ జాదవ్‌ తానాజీ, ఏఈ సతీష్‌లు ఉన్నారు.

Updated Date - 2021-10-29T05:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising