ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్యంతో నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు!

ABN, First Publish Date - 2021-06-13T06:53:59+05:30

గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా చేసి సేంద్రీయ ఎరువుల తయా రీని చేసేందుకు నిర్మించిన షెడ్లను ఉపయోగంలోకి తేక పోవడంతో అవి అలంకార ప్రాయంగానే కాకుండా

మండలంలో అలంకారప్రాయంగా ఉన్న సెగ్రిగేషన్‌ షెడ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలంకారప్రాయంగా సెగ్రిగేషన్ల షెడ్ల నిర్మాణం

తలమడుగు, జూన్‌ 12: గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్లు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా చేసి సేంద్రీయ ఎరువుల తయా రీని చేసేందుకు నిర్మించిన షెడ్లను ఉపయోగంలోకి తేక పోవడంతో అవి అలంకార ప్రాయంగానే కాకుండా అక్రమదందాలకు అడ్డాగా మారింది.గ్రామ సమీపంలో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్లలో సేంద్రీయ ఎరువులను తయారు చేయక పోవడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. మండలంలోని 28 గ్రామ పంచాయతీలో మొత్తం 28 షెడ్లను నిర్మించారు. అయితే, వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.2లక్షల 50వేల ఖర్చు చేసినప్పటికీ.. అవి ఎలాంటి ఉపయోగపడడం లేదని అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాంట్రాక్టర్ల పనుల కోసమే నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంతో గ్రామాల్లోని వ్యర్థ పదార్థాలను అందులో వేసి ఎరువుల తయారి చేయాల్సి ఉన్నప్పటికీ మండలంలో ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ ఎరువుల తయారీకి నోచుకోకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్లను ఉపయోగంలోకి తీసుకొచ్చి సేంద్రీయ ఎరువుల తయారికి ఉపయోగించాలని మండల వాసులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-13T06:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising