ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పగిలిన మిషన్‌ భగీరథ పైపులైన్‌.. జలమయమైన రోడ్డు

ABN, First Publish Date - 2021-12-03T07:05:15+05:30

ఖానాపూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ పగిలిపోవటంతో రహదారి జల మయం అయింది.

పైపులైన్‌ పగిలి రోడ్డుపైనే ప్రవహిస్తున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌ రూరల్‌, డిసెంబర్‌ 2 : ఖానాపూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ పగిలిపోవటంతో రహదారి జల మయం అయింది. ఆర్‌ అండ్‌ బీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ పైపు లైన్‌ నుండి నీళ్లు లీకు అవుతున్నాయి. దీంతో రహదారి మొత్తం జల మయం అయింది. పెద్దనీటి గంత ఏర్పడింది. వాహనాలు వెలుతున్న సమ యంలో గుంతలో ఉన్న నీళ్లు ఇతరులపైన పడుతున్నాయని పలువురు వా పోయారు. ఈ ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌, ఇతర చిన్న వ్యాపారులు చేసుకునే వారు, వివిద దుకాణాలు, అటోలు ఆగటం నిత్యం వచ్చిపోయే వారితో బిజీగా ఉంటుంది. వెంటనే  అధికారులు మరమత్తులు చేయక పోవటంతో వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. గతంలో అనేక సార్లు ఈ పైపులైన్‌ పగిలిపోతే అధికారులు తాత్కాలిక మరమత్తులు చేసి వదిలేసారు. కాని సమస్య మాత్రం పరిష్కారం చేయలేదని, నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చేసి, లీకేజీ కాకుండా చూడాలని కోరుతున్నారు.

Updated Date - 2021-12-03T07:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising