ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా గుప్పిట్లో సరిహద్దు గ్రామాలు

ABN, First Publish Date - 2021-05-12T06:46:53+05:30

మండలానికి ఆనుకొని పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో జైనథ్‌ మండలంలోని సరిహద్దు గ్రామాలైన బహదూర్‌

మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్‌ మండలంలోని బోరజ్‌ గ్రామం నిర్మానుష్యంగా మారిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు 

వ్యాక్సినేషన్‌పై కొనసాగుతున్న సందిగ్ధత 

అప్రమత్తం అవుతున్న రెవెన్యూ, పోలీసు శాఖల యంత్రాంగం

జైనథ్‌, మే 11: మండలానికి ఆనుకొని పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో జైనథ్‌ మండలంలోని సరిహద్దు గ్రామాలైన బహదూర్‌పూర్‌, కాప్రీ, కరంజి, ఉమ్రి, కూర, పెండల్‌వాడ, కౌట, సాంగ్వి, కోర్టా, అకోలి, హత్తిఘాట్‌, బోరజ్‌, డొల్లార, మాండగడ, పిప్పర్‌వాడ గ్రామాల్లో మృత్యు ఘంటికలను మొగిస్తోంది. ఈనెల 15వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ విధించక ముందే ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సిద్ధమై ప్రజలు విధిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. దీంతోపై గ్రామాల ప్పరజలు తమకు ఎప్పుడు ఎలాంటి ప్రాణహాని కలుగుతుందో అన్నదానిపై గ్రామీణ ప్రజలు మానసిక ఆందోలనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మొదటి, రెండో విడత కరోనా టీకాలను జైనథ్‌, గిమ్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొరత కారణంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో మండల రెవెన్యూ పోలీసు సిబ్బంది అప్రమత్త తపై మండల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - 2021-05-12T06:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising