ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌తో జర జాగ్రత్త!

ABN, First Publish Date - 2021-12-25T06:09:59+05:30

కరోనా వైర స్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినా.. ఒమైక్రాన్‌ వేరియంట్‌తో జర జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఆపదలను కొని తెచ్చుకున్నట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదుకాక పోయిన అప్రమత్తత అవసరమే అంటున్నారు. కరోనా వైరస్‌ కంటే ఒమైక్రాన్‌ వైరస్‌ అతివేగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావాసులకు చలికాలపు గుబులు

మొదలైన పండుగలు, శుభకార్యాలు, వేడుకలు

కట్టడికి చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు

అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం

వ్యాక్సినేషనే శ్రీరామరక్ష అంటున్న వైద్యులు

జనవరిలో వైరస్‌ విజృంభించే అవకాశం 

జిల్లావ్యాప్తంగా మొత్తం 7లక్షల 60వేల 327 మందికి రెండు డోసుల  టీకా

ఆదిలాబాద్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైర స్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినా.. ఒమైక్రాన్‌ వేరియంట్‌తో జర జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ఆపదలను కొని తెచ్చుకున్నట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదుకాక పోయిన అప్రమత్తత అవసరమే అంటున్నారు. కరోనా వైరస్‌ కంటే ఒమైక్రాన్‌ వైరస్‌ అతివేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యం లోనే ఇటీవల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా అధికారులతో స మీక్షించారు. దీంతో పట్టణ ప్రాంతంలో 2లక్షల 32 వేల 180 మంది, గ్రా మీణ ప్రాంతంలో 5లక్షల 28వేల 147 మంది మొత్తం 7లక్షల 60వేల 327మంది మొదటి, సెకండ్‌ డోసులను వేయించుకున్నారు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమ య్యాయి. జనవరిలో వైరస్‌ వ్యాప్తి మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఒమైక్రాన్‌ వైరస్‌ పెద్దగా ప్రా ణాంతకం కాకపోయిన వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అయితే శీతాకాలం మొదలు కావడంతో వైరస్‌ వ్యాప్తికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సీజనల్‌ వ్యాధుల ముప్పు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. చలి తీవ్రతతో ఎక్కువ మంది జలుబుతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో ఏది సాధారణ జలుబో.. ఏది ఒమైక్రాన్‌ వేరియంటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఒమై క్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 

జిల్లాలో చలి తీవ్రత

జిల్లాలో గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతు న్నాయి. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయి చలి తీవ్రత పెరిగిపోతుంది. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయి. కొన్ని మండలాల్లో 3నుంచి 5డిగ్రీల కనిష్ఠ ఉ ష్ణోగ్రతలు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాతావరణ మా ర్పులతో సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ తోడైతే మరిం త ప్రమాదకరమేనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. సాధారణంగానే చలి కాలంలో జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో ఏది కరోనా? ఏది సాధారణ జలుబో? తెలియని పరిస్థితులు నెల కొంటున్నాయి. ప్రధానంగా అస్తమా, బీపీ, షుగర్‌, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభంకావడంతో జిల్లావాసుల్లో చలి కాలపు గుబులు మొదలయ్యింది. 

వేడుకలపై ఆంక్షలు?!

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో కొవిడ్‌ నిబంధనలను అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే సమయంలో పం డుగలు రావడం, షాపింగ్‌లు చేయడం, అందరూ ఒక చోటకు చేరి సం బరాలు జరుపుకోవడంతో.. ఏమాత్రం కొవిడ్‌ నిబంధనలు పట్టిం చుకున్నట్లు కనిపించడం లేదు. అలాగే క్రిస్మస్‌ పండుగ రానే వచ్చింది. ఇప్పటికే పెళ్లి ముహుర్తాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు చివరి వర కు మంచి ముహుర్తాలే ఉండడంతో గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలోనే వేరియంట్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చలి కాలానికి శుభాకార్యాల హడావుడి తోడవడంతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే జనవరిలో ఎక్కువ కేసులు నమో దయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా హైక్టోర్టు కట్టడి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తుంది. భారీగా జన సమూహం ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరింది. రాత్రి వేళల్లోను కర్ఫ్యూను విధించాలని ఆదేశించింది. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని, వైరస్‌ వ్యాప్తి ఉధృతం కాకముందే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేసింది.

ముంచుకొస్తున్న ముప్పు కాలం

కరోనా వైరస్‌ ప్రభావం తగ్గినా ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఫ్రభావం పెరగడంతో మరి కొన్నాళ్ల పాటు అప్రమత్తంగా ఉండక తప్పదంటున్నారు. ఇప్పటికే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎవరి పనులు వారు చేసు కుంటున్నారు. ముందులాగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం అంతగా కనిపించడం లేదు. ప్రజా రవాణా కూడా యధా విధిగా మారింది. మునుపటి మాదిరిగా బస్సు ప్రయాణం, ఆటో, జీబుల లో ప్రజలు కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. శానిటైజర్‌ల వాడకమూ  తగ్గింది. కనీస జాగ్రత్తలు పాటించకుండానే ప్రజలు బిజీబిజీగా కనిపిసు ్తన్నారు. రానున్నరోజుల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. ముప్పు కాలం ముందుండడంతో జర జాగ్రత్తగా ఉండాలంటున్నా రు. ప్రస్తుతం జిల్లాలో వారానికి నాలుగైదు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జనవరిలో పాజిటివ్‌  కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కొంత మేరకు అవగా హన వచ్చిన అజాగ్రత్తగా ఉండకూడదంటున్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకిన వ్యాక్సినేషనే శ్రీరామరక్ష అంటూ వైద్యులు చెబుతున్నారు.

వాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాం

: నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

ప్రస్తుతం వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకదృష్టిని సారించాం. ఒమైక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి దృష్ట్యా చలికాలంతో కొంత ఇబ్బందికరమే. జిల్లాలో 85శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. మరికొన్నాళ్ల పాటు భౌతికదూరం, మాస్కులు తప్పనిసరి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారైతే కొన్నాళ్లు బయటకు రాకపోవడమే మంచిది. కరోనా టెస్టులు నిరంత రంగా చేస్తున్నాం. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వారానికి రెండు, మూడు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అందగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి జిల్లాలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు కాలేదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. 

జిల్లాలో కరోనా కేసులు నిల్‌

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలో శుక్రవారం కరోనా కేసులు నమోదు కాలేదని, నిల్‌ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తం గా 257 మందికి పరీక్షలు నిర్వహించామని, అయితే ముగ్గురు అనుమానితులు హోం ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఒమైక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే దేశంలో 250 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.  జిల్లాలో ఇప్పటి వరకు 5లక్షల 42వేల 978 కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. కాగా జిల్లాలో 87 మంది కరోనా వైరస్‌తో మృతి చెందగా, 16,585 మంది కరోనా బారీన పడ్డారని వివరించారు.

Updated Date - 2021-12-25T06:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising