ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-12-05T05:51:05+05:30

ఒమైక్రాన్‌ వేరియంట్‌పై ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సూచించారు.

టీకా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 4 : ఒమైక్రాన్‌ వేరియంట్‌పై ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సూచించారు. అస్రాకాలనీలోని మస్తానియా మజీద్‌ ప్రాంగణంలో శనివారం కొవిడ్‌ టీకా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రతీఒక్కరూ కొవిడ్‌ టీకా తీసుకోవాల న్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అన్నారు. మాస్కులు ధరించడం మరువవద్దని, భౌతికదూరం పాటించాలని అన్నారు. కొత్తగా ఉత్పన్నమైన ఒమైక్రాన్‌ డెల్టా వేరియంట్‌ కంటే ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంద న్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. కొవిడ్‌ లక్షణా లు పసిగట్టి వెంటనే స్థానిక ప్రాథమిక కేంద్రానికి వెళ్లిపరీక్షలు చేయించు కోవాలన్నారు. కొవిడ్‌ టీకా లక్ష్యసాధనకు కృషి చేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. జిల్లా వైద్య అధికారి ధనరాజ్‌, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్‌ ఫరాగ్‌పర్వీన్‌, అన్వర్‌పాషా, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, పలువురు కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్‌, గండ్రత్‌ రమణ, నాయకులు తారక రఘువీర్‌, జాఫర్‌, వసీం పాల్గొన్నారు. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

పెంబి, డిసెంబరు 4 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేకడ్రైవ్‌లో భాగంగా శనివారం జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ ఫారూఖీ పెంబి మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి ఇంటింటికి వెళ్లి టీకాలు వేసేతీరును పరిశీలించి, వృద్ధుడికి దగ్గరుండి వ్యాక్సిన్‌ వేయించారు. వ్యాక్సిన్‌పై అపోహలు, భయాలు వద్దని, అర్హులైన ప్రతీఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, మూడవదశ కరోనా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పెంబి మండలంలో ఏ ఒక్కరూ మిగలకుండా అందరూ వ్యాక్సిన్‌ వేసుకొని వందశాతం పూర్తి చేయాలని అన్నారు. మాస్క్‌ తప్పనిసరిగా ధరిం చాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ధికారి ధనరాజ్‌, తహసీల్దార్‌ రామ్‌మోహన్‌, సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T05:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising