ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటెల బర్తరఫ్‌ సమంజసం కాదు

ABN, First Publish Date - 2021-05-12T06:51:49+05:30

తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాడిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడం సమంజసం కాదని ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం మం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిరాజ్‌ జిల్లా అధ్యక్షుడు శివయ్య

తలమడుగు, మే 11: తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాడిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడం సమంజసం కాదని ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని పల్లి(బి), రుయ్యాడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ముందుండి పోరాటం చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కావాలనే ఈటెల రాజేందర్‌ను తొలగించారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం మాజీ మంత్రి ఎంతో కృషి చేశారన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడ్డాక తొలి మంత్రివర్గంలో ఆర్థిక శాఖను ఎంతో పకడ్బందీగా అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. అంతేకాకుండా కరోనా కష్ట కాలంలోను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేసిన ఈటెల రాజేందర్‌ను విమర్శించడం శోచనీయమన్నారు. ఇందులో ముదిరాజ్‌ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T06:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising