ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ ఎరువులపై అవగాహన సదస్సు

ABN, First Publish Date - 2021-04-24T04:32:25+05:30

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని దొనబండ గ్రామంలో తడి, పొడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన సదస్సును నిర్వహించారు.

సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పిస్తున్న అధికారి రవిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, ఏప్రిల్‌ 23: మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని దొనబండ గ్రామంలో తడి, పొడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన సదస్సును నిర్వహించారు. రాష్ట్ర రీసోర్స్‌పర్సన్‌ వెంకట్‌ మండలం లోని 17గ్రామపంచాయతీలకు సంబంధించిన సర్పంచ్‌ లకు, పంచాయతీకార్యదర్శులకు మల్టీపర్పస్‌ వర్కర్లకు వానపాములను వినియోగించి తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లోనూతనంగా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్‌ యార్డ్‌లలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి సేంద్రియ ఎరువులు తయారు చేసి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. 10కిలోల తడి చెత్తతో 45రోజుల్లో రెండు కిలోల సేంద్రియ ఎరువు తయారవుతుందన్నారు. కార్యక్ర మంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, ఎంపీడీవో మహ్మద్‌ అబ్దుల్‌హై, ఉపాధిహామీ పీవో మల్లయ్య, డీఎల్‌పీఓ రవీందర్‌ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T04:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising