ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆరుద్ర’ ఆనందం

ABN, First Publish Date - 2021-06-13T06:14:33+05:30

‘ఆరుద్ర’ పురుగులు ఈ పేరు తెల్వని రైతన్న ఉండరనడంలో ఆశ్చ ర్యం లేదు....

ఖానాపూర్‌ సమీపంలోని అడవుల్లో ఆరుద్ర పురుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదిహేను రోజుల ముందుగానే ప్రకృతి నేస్తాలు 

ఈ యేడు పంటలకు అనుకూలమంటున్న  రైతులు

ఖానాపూర్‌, జూన్‌ 12 : ‘ఆరుద్ర’ పురుగులు ఈ పేరు తెల్వని రైతన్న ఉండరనడంలో ఆశ్చ ర్యం లేదు.... ఈ ఆరుద్ర పురుగులను రైతన్నల నేస్తాలుగా భావిస్తారు. మృగశిర కార్తె ముగిసిన తర్వాత వచ్చే ఆరుద్రకార్తెలో మాత్రమే కనిపించే ఆరుద్ర పురుగులు ఈ యేడాది ముందుగానే దర్శనమిస్తున్నాయి. ఆరుద్ర పురుగులు పదిహేను రోజుల ముందే కనిపించడంతో రైతన్నల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ ఆరుద్ర పురుగులు ముందస్తుగా దర్శనమిచ్చిన యేడు వర్షాలు విరివిగా కురుస్తాయని, పంటలు కూడా ఆశాజనకంగా ఉంటాయని పెద్దల నానుడి. గతేడాది సైతం ఆరుద్ర పురుగులు ముందస్తుగా కనిపించాయని దీంతో వర్షాలు విరివిగా కురిసాయని రైతులు చెబుతున్నారు. రైతన్నతో తన బందాన్ని ఇంతలా పెనవేసుకున్న ఈ అరుదైన ప్రకృతి నేస్తాలు ఇప్పుడు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అడవుల్లో విరివిగా కనిపించడం శనివారం ఆంధ్రజ్యోతి క్లిక్‌ మనిపించింది.


Updated Date - 2021-06-13T06:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising