ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూముల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి

ABN, First Publish Date - 2021-11-27T03:49:00+05:30

పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిం చాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ల్యాండ్‌ సర్వేయర్లు, అటవీ శాఖ అధికారులకు పోడు భూములపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 26:  పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిం చాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ల్యాండ్‌ సర్వేయర్లు, అటవీ శాఖ అధికారులకు పోడు భూములపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 11,774 దరఖా స్తులు రాగా 33,418 అటవీ భూమి సాగులో ఉందని, భూము ల నిర్ధారణలో అటవీ అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమైంద న్నారు. ఒక్క అంగుళం అటవీ భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. పోడు భూము ల దరఖాస్తుల పరిశీలనలో ప్రభు త్వ అనుమతి రావాల్సి ఉంద న్నారు. జిల్లాలో 16 మంది సర్వే యర్లు, 95 బృందాలు పనిచేస్తు న్నారని, జీపీఎస్‌ విషయంలో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంద న్నారు. బెల్లంపల్లి పరిధిలోని ఆకెనపల్లి, నేతకానిగూడెంలలో 1,680 ఎకరాల భూమి ఉం దని, దేవాపూర్‌, ధర్మారావుపేటలో 106, కొర్విచెల్మ, లంబాడితండా, మల్కేపల్లిలో 154, వెంక టాపూర్‌, బుగ్గగూడెం, ఆల్గాంలో 591 ఎకరాల భూమిని గుర్తించామని తెలిపారు. హ్యాబిటేషన్ల వారీగా వచ్చిన దర ఖాస్తులు, భూమి విస్తీర్ణం, తదితర వాటితో సమగ్ర నివేదికలు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, అటవీ శాఖల అఽధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-27T03:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising