ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2021-10-22T06:43:24+05:30

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నిర్మల్‌ టౌన్‌, అక్టోబరు 21 : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. 25వ తేదీ నుంచి నిర్వహించే ఇంటర్‌ పరీక్షల ఏర్పా ట్లపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్‌ సెక్రటరీ సయ్యద్‌ ఉమార్‌ జలీల్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ అబ్దుల్‌ఖలీల్‌లతో కలిసి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇంటర్‌ విద్యాశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించినే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు మాట్లాడుతూ... కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం 7,924 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ రాంరెడ్డి, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి జాదవ్‌ పరుశురాం, పరీక్షల కమిటీ మెంబర్లు డా. వెంకటేశ్వర్లు, జాదవ్‌ రవికిరణ్‌, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T06:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising