ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదవీకాలం పొడగించలేదనే అక్కసుతోనే. ..

ABN, First Publish Date - 2021-08-03T06:14:24+05:30

మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా మరో ఏడాది తన పదవీ కాలాన్ని పొడగించకపోవడంతోనే గంగనర్సయ్య స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షులు తాళ్ల పెల్లి రాజగంగన్న, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ జడ్పీటీసి స భ్యులు రాథోడ్‌ రామూనాయక్‌లు అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి రాజగంగన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు తాళ్లపెల్లి రాజగంగన్న

ఖానాపూర్‌, ఆగస్టు 2 : మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా మరో ఏడాది తన పదవీ కాలాన్ని పొడగించకపోవడంతోనే గంగనర్సయ్య స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షులు తాళ్ల పెల్లి రాజగంగన్న, టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ జడ్పీటీసి స భ్యులు రాథోడ్‌ రామూనాయక్‌లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్బంగా విశ్రాంత ఉపాఽధ్యాయులైన గంగ నర్సయ్యకు తమ పార్టీలో రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమించి ఎమ్మెల్యే రేఖానాయక్‌ సముచిత గౌరవం కల్పించారన్నారు. ఏడాది పదవీకాలంలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా తరుచుగా అనారోగ్య కారణాలు చెబుతూ గంగనర్సయ్య హైదరాబాద్‌కే పరిమితమయ్యారన్నారు. ఏడాది కాలంపాటు పదవిని అనుభవించిన గంగనర్సయ్య ప్రస్తుతం తన పదవీకాలం ఒక్కరోజులో ముగుస్తుందనగా రాజీనామా చేయడం హాస్యాస్పదం అన్నారు. చెప్పుడు మాటలు వింటూ ఇటు వంటి చౌకాబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఇతర పార్టీలకు కోవర్టుగా మారి అన్ని రకాలుగా గౌరవం కల్పించిన పార్టీకి, ఎమ్మెల్యేకు ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరన్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, వైస్‌చైర్మన్‌ అబ్దుల్‌ఖలీల్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శనిగారపు శ్రావణ్‌కుమార్‌, పెంబీ మండలాధ్యక్షులు పుప్పాల శంకర్‌, కొక్కుల ప్రదీప్‌, జన్నారపు శంకర్‌, తూము చరణ్‌, గుగ్గిళ్ళ సతీష్‌, కోడిమ్యాల వీరేష్‌, ఎల్ముల శోభన్‌బాబు, కౌఠ మహేష్‌ తదితరులున్నారు.


Updated Date - 2021-08-03T06:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising