ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విజయగర్జన’కు కార్యకర్తలు తరలిరావాలి

ABN, First Publish Date - 2021-10-28T03:27:45+05:30

వరంగల్‌లో నవంబరు 15న నిర్వహించే విజయగర్జన సభకు ప్రతీ టీఆర్‌ఎస్‌ కార్యకర్త తరలిరావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణంలోని పద్మశాలి భవన్‌లో బుధవారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, అక్టోబరు 27: వరంగల్‌లో నవంబరు 15న నిర్వహించే విజయగర్జన సభకు ప్రతీ టీఆర్‌ఎస్‌ కార్యకర్త తరలిరావాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పట్టణంలోని పద్మశాలి భవన్‌లో బుధవారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్న శుభ సందర్భంగా పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఈ విజయగర్జన సభకు ప్రతీ కార్యకర్త  తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గం నుంచి వచ్చే కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. సభ రోజు ఉదయ 7 గంటలలోపు ప్రతి గ్రామంలో ప్రతి బస్సుకు పార్టీ బ్యానర్‌ కట్టి త్వరగా వరంగల్‌ సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం కళ్యాణి, జడ్పీ వైస్‌చైర్మన్‌ సత్యనారా యణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T03:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising