ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN, First Publish Date - 2021-03-09T05:17:41+05:30

సమస్యల పరిష్కారానికి చర్యలు

అర్జీలను స్వీకరిస్తున్న ఏపీవో భీంరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి8: సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఫిర్యాదుల విభాగంలో భాగంగా వివిధ వర్గాల ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్‌ ఉపాధి కల్పన, డబుల్‌బెడ్‌రూం మంజూరు చేయాలని అర్జీలు రావడం జరిగిందన్నారు. వాటిని అధికారులకు పంపించి చర్యలు చేపడతామన్నారు. ఇందులో ఆర్డీవో జాడీ రాజేశ్వర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్‌రూరల్‌: ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల నుంచి వస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించడానికి ఐటీడీఏ పీవో భవేష్‌మిశ్రా ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏపీవో(జనరల్‌) కనక భీంరావు అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ గిరిజన దర్బార్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. గిరి వికాసం, అటవీ హక్కుల చట్టం పట్టాలు, రైతు బంధు ద్వారా తమకు వికాసం కల్పించాలని గిరిజనులు రాథోడ్‌ విశ్వేష్‌, కిష్టు, భీంరావు కోరారు. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌ మండలాల ప్రజలు తాము అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నందున ఐటీడీఏ ద్వారా వైద్యం కోసం కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తిర్యాణి మండలం దంపూర్‌, ఆసిఫాబాద్‌ మండలం కన్నెపల్లిలకు చెందిన సంతోష్‌ తదితరులు తమకు రైతు బంధు రావడం లేదని వివరించారు. రెబ్బనకు చెందిన రాజన్న రైతు బంధు, అటవీ హక్కు చట్టం పట్టాలు సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సున్నం రాంబాబు, మేనేజర్‌ విశ్వనాథ్‌, సూపర్‌వైజర్‌ సురేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising