ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2021-01-22T05:18:59+05:30

జిల్లాలోని వివిధ వాహనదారులు రహదారి నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్‌ ఏఎంవీఐ కె.మహేష్‌, జైనథ్‌ రూరల్‌ సీఐ కె.మల్లేష్‌ అన్నారు. గురువారం 32వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ ప్లాజా కార్యాలయంలో వివిధ వాహనదారులకు అవగాహన కల్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, జనవరి 21: జిల్లాలోని వివిధ వాహనదారులు రహదారి నిబంధనలు పాటించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని  ఆదిలాబాద్‌ ఏఎంవీఐ కె.మహేష్‌, జైనథ్‌ రూరల్‌ సీఐ కె.మల్లేష్‌ అన్నారు. గురువారం 32వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ ప్లాజా కార్యాలయంలో వివిధ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. జిబ్రాక్రాసింగ్‌ గుర్తులను, కుడి ఎడమవైపు వెళ్తున్న వాహనాలు, రోడ్లు దాటి తప్పుడు గమనించాలన్నారు. వాహనాలను మద్యం తాగినడిపితే మీ కుటుంబాలు రోడ్డున పడుతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిరెడ్డివెంకన్న, పీఆర్‌ఓ క్రెసర్‌ సింగ్‌రాథోడ్‌, సర్పంచ్‌ సంతోష్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ సిబ్బంది ఉన్నారు.

గుడిహత్నూర్‌: రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా గురువారం గుడిహత్నూర్‌లో ఏఎంవీఐలు మధు, చంద్రశేఖర్‌, పోలీసులు వాహనదారులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసుస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎంవీఐలు మధు, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఇందులో ఎస్సై రోహిణి, ఏఎస్సై రెహెమాన్‌ఖాన్‌, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising