ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-12-09T04:21:37+05:30

సమయపాలన పాటించని ఉపాధ్యా యుల పై చర్యలు తీసుకోవాలని నేతకాని స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు

డీఈవోకు వినతి పత్రం అందజేస్తున్న ఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నేతకాని స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు
ఏసీసీ, డిసెంబరు 8: సమయపాలన పాటించని ఉపాధ్యా యుల పై చర్యలు తీసుకోవాలని నేతకాని స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నాయకులు బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు  వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారని అన్నారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యా యులు 11 గంటలైనా హాజరు కావడం లేదన్నారు. మరికొందరు ఉపాధ్యాయులు కరీంనగర్‌, వరంగల్‌, గోదావరిఖని ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగిస్తూ తరుచుగా విధులకు గైర్హాజరవుతున్నారన్నారు. ఇలాంటి ఉపాధ్యాయు లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముడిమడుగుల శేఖర్‌, గోళ్ల మహేందర్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T04:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising