ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదపుటంచున ప్రయాణం

ABN, First Publish Date - 2021-07-09T04:31:33+05:30

ఆసిఫాబాద్‌ మండ లంలోని గుండి గ్రామప్రజలు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. గుండివాగు(పెద్దవాగు)పై నిర్మిస్తున్న వంతెన దశాబ్దాల కాలంగా అసంపూర్తి గానే ఉంది.

తెప్పపై పెద్దవాగును దాటుతున్న గ్రామస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గుండివాసులకు తప్పని తిప్పలు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 8: ఆసిఫాబాద్‌ మండ లంలోని గుండి గ్రామప్రజలు ప్రమాదపుటంచున ప్రయాణం చేస్తున్నారు. గుండివాగు(పెద్దవాగు)పై నిర్మిస్తున్న వంతెన దశాబ్దాల కాలంగా అసంపూర్తి గానే ఉంది. తాత్కాలికంగా వేసిన రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామ స్థులు ఆసిఫాబాద్‌కు రావడానికి తెప్పలపై ప్రమా దపుటంచున ప్రయాణం చేస్తున్నారు. 2005లో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించి దశాబ్దంన్నర కావ స్తున్నప్పటికీ పిల్లర్ల దశను వీడలేదు. ప్రతియేటా గుండి గ్రామ ప్రజలే కాకుండా నందుపా, చోర్‌పల్లి, కనర్‌గాం తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు వాగు ఉప్పొంగి ప్రవహించి నప్పుడల్లా వాంకిడి మండలం కమాన మీదుగా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆసి ఫాబాద్‌కు రావాల్సి వస్తోంది. కేవలం జిల్లా కేంద్రానికి అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామప్రజలు వం తెనలేని కారణంగా 25కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఆయాగ్రామాల్లో వైద్యసమస్యలు తలెత్తిత్తే 108 వాహనం రావడానికి సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తెప్పల సహయంతో గుండి పెద్దవాగుపై నుంచి తెప్పలపై వస్తున్నారు. వారు ఒక్కొక్కరి నుంచి నీటిమోతాదును బట్టి రూ.10, 20 తీసుకుంటున్నారు. గతంలో తెప్పలు సైతం గల్లంతైన సంఘట నలు ఉన్నాయి. ఐతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 

Updated Date - 2021-07-09T04:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising