ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ABN, First Publish Date - 2021-07-31T07:04:01+05:30

ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై శుక్రవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు.

ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఇదే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు రికార్డుల స్వాధీనం ఫ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ

ఖానాపూర్‌, జూలై 30 : ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై శుక్రవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఖానాపూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. మండలంలోని ఓ విరాసత్‌పట్టాకు సంబంధించి తహసీల్దార్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతో బాదితుడు ఏసీబి అధికారులను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఽశుక్రవారం ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య ఆద్వర్యంలో ఏసీబి అధికారుల బృందం దాడులు జరిపింది. పలు రికార్డులను స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఓ వీఆర్‌ఏను అదుపులోకి తీసుకుని విచారించారు. తహసీల్దార్‌ నరేందర్‌ను డిప్యూటీ తహసీల్దార్‌ ఫారూఖ్‌ను సైతం అధికారులు విచారించినట్లు తెలిసింది. శుక్రవారం అర్దరాత్రి వరకు కూడా విచారణ కొనసాతోంది.. విచారణ పూర్తైతేనే పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 


Updated Date - 2021-07-31T07:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising