ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాదాసీదాగా జడ్పీ సర్వసభ్య సమావేశం

ABN, First Publish Date - 2021-06-20T06:30:01+05:30

జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభ్యులు సభాదృష్టికి తీసుకొచ్చారు. ఒకపక్క కరోనా, మరో పక్క ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అవి పరిష్కారానికి నోచుకోలేక పోతున్నాయని జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభాధ్యక్షుడికి వివరించారు.

సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం : జడ్పీ చైర్మన్‌ జనార్ధన్‌ రాథోడ్‌ 

వైద్యుల పోస్టులు భర్తీ చేయాలన్న సభ్యులు 

రైతులకు అన్యాయం జరుగకుండా చూడాలని విజ్ఞప్తి 

బ్యాంకర్లతో సమీక్షిస్తామన్న జిల్లా కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 19: జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభ్యులు సభాదృష్టికి తీసుకొచ్చారు. ఒకపక్క కరోనా, మరో పక్క ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అవి పరిష్కారానికి నోచుకోలేక పోతున్నాయని జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభాధ్యక్షుడికి వివరించారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌బాపురావ్‌, ఆత్రం సక్కు, రేఖశ్యాంనాయక్‌లతో పాటు ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. జిల్లాలో నెలకొన్న రోడ్లు, సమస్యలతో పాటు మిషన్‌ భగీరథ, తాగునీరు వంటి సమస్యలపై సభ్యులు సభకు వివరించగా.. సమావేశం ఎప్పటిలా కాకుండా ఆది నుంచి సాదాసీదాగానే కొనసాగింది. దీంతో కొంత మంది సభ్యులు రోడ్లు, విద్య, వైద్యం, అన్నదాతల సమస్యలపై మాట్లాడి సభాధ్యక్షులకు చర్యలు తీసుకోవాలని కోరారు.  గిరిజన సంక్షేమంపై ప్రత్యేకదృష్టి సారించాలని, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా సాధించిన ప్రగతిపై సభ్యులు మాట్లాడుతునే అధికారుల తీరు బాగాలేదని, ప్రభుత్వం అన్ని విధాల నిధులు మంజూరు చేస్తున్న వాటిని అధికారులు వినియోగించుకుని ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేకదృష్టి సారిస్తుంటే.. జిల్లాలో మాత్రం రిమ్స్‌తో పాటు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల ఖాళీలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని సభ్యులు అన్నారు. అలాగే, మండిపడ్డారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక విధాలుగా పాటు పడుతుంటే అధికారుల తీరుతో వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం చేయాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు విజ్ఞప్తి చేశారు. ఆరోపించారు. అలాగే, రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల నుంచి బాకీ కింద జమ చేసుకోకుండా దీనిపై బ్యాంకర్లతో సమీక్షిస్తామని కలెక్టర్‌ అన్నారు. ఇప్పటికే రైతుబంధు డబ్బులను మిగితా బాకీల కింద జమ చేసుకోవద్దని సూచించడం జరిగిందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-20T06:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising