ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు

ABN, First Publish Date - 2021-04-23T04:59:29+05:30

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం మండలంలోని పెండల్‌వాడ గ్రామంలో నాయకులు, గ్రామస్థులతో కలిసి అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవి ష్కరించారు.

పెండల్‌వాడ బహిరంగ సభలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌, ఏప్రిల్‌ 22: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం మండలంలోని పెండల్‌వాడ గ్రామంలో నాయకులు, గ్రామస్థులతో కలిసి అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవి ష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో వారు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్‌ 3 ద్వారా చిన్న రాష్ర్టాల ఏర్పాటు సాధ్యమ న్నారు. విద్య, ఉద్యోగాల కల్పనతో పాటు ఎన్నికల్లో రిజర్వేషన్‌ల ఫలితం ద్వారా అట్టడుగు వారు విద్య, ఉద్యోగాలు పొందడంతో పాటు పదవులను అనుభవిస్తు న్నారన్నారు. ఐదేళ్లకోరి వచ్చే ఎన్నికల్లో ప్రజల అభివృద్ధినికాంక్షించే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ నాందెవ్‌కాంబ్లె, ఆదిలాబాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్‌, జడ్పీటీసీ తుమ్మల అరుందతి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి, సర్పంచ్‌ జంగిలి నవనీతసురేష్‌, ఎంపీటీసీ కాసర్ల అశోక్‌, అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షులు బట్టు సతీష్‌, నాయకులు జంగిలి సంతోష్‌, వైద్య సంజయ్‌లతో పాటు ఆయా గ్రామాల దళిత సోదరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T04:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising