ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 రోజుల్లో పనులు పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2021-01-21T04:15:40+05:30

15 రోజుల్లో పనులు పూర్తిచేయాలి

కరోనా వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారుల పనితీరుపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

వెంకటాపురం(నూగూరు), జనవరి 20: మండల అధికారుల పనితీరుపై అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంతో నత్తనడకన జరుగుతున్నాయని ఆగ్రహించారు. వెంకటాపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, సర్పంచ్‌లతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, రైతు వేదికల పనుల వివరాలను తెలుసుకున్నారు. రైతు కల్లాల విషయమై అడిగారు. మరుగుదొడ్ల నిర్మాణాలను జియో ట్యాగింగ్‌ చేయాలని, ఉపాధి హామీలో కూలీలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయని పక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ హెచ్చరించారు. సమీక్షకు హాజరుకాని అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం వెంకటాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి కరోనా వ్యాక్సినేషన్‌ గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:15:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising