ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలుష్య పరిశ్రమలపై చర్యలేం తీసుకున్నారు?

ABN, First Publish Date - 2021-01-26T09:12:41+05:30

జీడిమెట్ల పారిశ్రామికవాడలో కాలుష్య పరిశ్రమలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ప్రశ్నించింది. పీసీబీ నోటీసులకు బదులివ్వని సంస్థలపై తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమగ్ర వివరాలతో నివేదికలివ్వండి: హైకోర్టు ఆదేశం


హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలో కాలుష్య పరిశ్రమలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ప్రశ్నించింది. పీసీబీ నోటీసులకు బదులివ్వని సంస్థలపై తీసుకున్న చర్యలను అడిగింది. పీసీబీ 45 పరిశ్రమలకు నోటీసులిస్తే... 16 పరిశ్రమలు మాత్రమే వాటికి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు అంతకుముందు పీసీబీ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మిగిలిన సంస్థలపై చర్యలేంటని కోర్టు ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న సంస్థలపై చర్యలకు ఉపక్రమించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. జీడిమెట్ల పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి రెండు వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. రెండు వ్యాజ్యాల్లో ఒకే తరహా అభియోగాలు ఉన్నందున ఒక వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. 

Updated Date - 2021-01-26T09:12:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising