ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కిన ఏసీపీ!

ABN, First Publish Date - 2021-04-08T08:18:09+05:30

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తు న్న ఓ పోలీసు ఉన్నతాధికారి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యాంకు ఖాతా నుంచి రూ.1.40 లక్షలు స్వాహా
  • పోలీసులకు ఫిర్యాదు.. రహస్యంగా దర్యాప్తు

వరంగల్‌ అర్బన్‌ క్రైం, ఏప్రిల్‌ 7: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తు న్న ఓ పోలీసు ఉన్నతాధికారి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ విభాగంలో పనిచేస్తున్న ఏసీపీ హన్మకొండలో నివాసముంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తాను బ్యాంక్‌ ఉద్యోగినని, తన పేరు సోఫియా జిమిక్‌ అని ఫోన్‌ ద్వారా పరిచయం చేసుకుంది. మాటల్లోకి దింపి తన వద్ద చాలా డబ్బులున్నాయని.. నిరుపేదల కు సహాయం చేసేందుకు కొందరు వ్యక్తుల సహాయం కావాలని కోరింది. బ్యాంక్‌ ఖాతా, ఇతర వివరాలు వెల్లడిస్తే డబ్బులు పంపిస్తానని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన ఏసీపీ.. తన బ్యాంకు ఖాతా వివరాలను ఆమెకు వెల్లడించారు. ఓటీపీ చెప్పాలని కోరడంతో అది కూడా తెలిపారు. దీంతో కొద్ది సేపట్లోనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు ఏసీపీ మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై బ్యాంకు అధికారులకు ఫోన్‌ చేసి విష యం చెప్పడంతో డబ్బులు డ్రాకాకుండా ఖాతాను బ్లాక్‌ చేశారు. అప్పటికే ఖా తా నుంచి సైబర్‌ నేరస్తులు రూ.1.40 లక్షలు డ్రా చేశారు. దీనిపై హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-04-08T08:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising