ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana BJP కి RSS నుంచి ఇబ్బందులు.. కమలనాథుల్లో భయం.. భయం.. అసలేం జరుగుతోంది..!?

ABN, First Publish Date - 2021-08-17T18:33:42+05:30

పార్టీ ఫస్ట్.. నేషన్ నెక్స్ట్.. పర్సన్ లాస్ట్.. ఇది భారతీయ జనతాపార్టీ నినాదం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పార్టీలో తెరచాటున ఉండాల్సిన నేతలు  తెరమీదకొచ్చేస్తునారా? ఆ జాతీయ పార్టీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న నాయకులెవరు? పార్టీలో సహజంగా ఉండే విభజన రేఖ మసకబారుతోందా? పార్టీని గాడిలో పెట్టాల్సిన వారే పార్టీని హైజాక్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందా? ఆ ప్రతినిధుల తీరు పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారుతోందా? ప్రతినిధులు.‌. పార్టీ నాయకత్వం మధ్య నడుస్తోన్న వివాదంపై పార్టీలో నడుస్తోన్న చర్చ ఏంటి? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఎక్కువైన ఆర్‌ఎస్ఎస్‌ జోక్యం..!

నిజానికి పార్టీ పదవులతో పాటు.. నామినేట్ పోస్టులను పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులకు ఇస్తుంటారు. ఈనేపథ్యంలో వివిధ సమీకరణాలకు బట్టి నాయకులను ఎంపిక చేస్తారు.‌ వీరి ఎంపికలో సంఘం ప్రతినిధులతో పాటు పార్టీ నాయకత్వం పాత్ర కూడా కీలకంగా ఉంటోంది. అయితే తాజాగా బీజేపీ జాతీయ యువమోర్చాలో  తెలంగాణకు రెండు పదవులు వచ్చాయి. ఈ పదవుల విషయంలో సంఘం ప్రతినిధులు చక్రం తిప్పారన్న చర్చ జోరుగా నడుస్తోందట.  బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదించకుండానే  వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి జాతీయ యువమోర్చాలో పదవి ఇప్పించారట. దీంతో ఈ పదవి వెనుక పెద్ద లాబీయింగ్ నడిచిందన్న విమర్శలు చేసుకుంటున్నారట. మరోవైపు పార్టీలోని అంతర్గత కారణాలతోనే  కొందరు సీనియర్లు ఈ మధ్య బీజేపీని వీడరన్న వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు చేస్తున్నారట. హుజురాబాద్‌కు ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మంచిది కాదని కమలనాథులు చెబుతున్నారట.


పార్టీకి పెద్ద తలనొప్పే..!

వాస్తవానికి సంఘానికి పార్టీకి మధ్య ఎవరిపని వారే చేసేలా విభజన రేఖ ఉంటుంది‌. అయితే గత కొన్నాళ్ళుగా విభజన రేఖ మసకబారుతోందన్న చర్చ జోరందుకుందట. పార్టీ తీసుకునే కార్యక్రమాలతో పాటు.. పార్టీ పదవుల పంపిణీ వరకు సంఘం ప్రతినిధులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారట. ఈ అంశం పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీని కాపాడాల్సిన ప్రతినిధులే పార్టీకి ఇబ్బందిగా మారారన్న గొణుగుళ్లు వినిపిస్తున్నాయట. తెరచాటు రాజకీయాలు నడపాల్సిన వారు లైన్ క్రాస్ అవుతున్నారని బీజేపీ వర్గాలంటున్నాయట.


బీజేపీ రాష్ట్రశాఖకు షాడో టీమ్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు!

బీజేపీలోని ప్రతీ రాష్ట్ర శాఖలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుంటారు. వీరికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.‌ అయితే ఈ ప్రతినిధులు తెరవెనుక మాత్రమే రాజకీయాలు చేస్తుంటారు. పార్టీ పరిస్థితులు, నాయకులను దగ్గర నుంచి పరిశీలించి ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపుతుంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటంతో పాటు.‌‌. క్రమశిక్షణ తప్పిన నాయకులను గాడిలో పెట్టడం కూడా సంఘం ప్రతినిధులు చేస్తుంటారు. ఒకరకంగా బీజేపీ రాష్ట్ర శాఖకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు షాడోగా ఉంటారు. అయితే తెలంగాణ పార్టీ నాయకత్వం చేయాల్సిన పనిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు చేస్తుండంతో వ్యవహారం బెడిసికొడుతోందట.


పార్టీకి, సంఘానికి మధ్య గ్యాప్‌!

పార్టీ ఫస్ట్.. నేషన్ నెక్స్ట్.. పర్సన్ లాస్ట్.. ఇది భారతీయ జనతాపార్టీ నినాదం. క్రమశిక్షణకు తమ పార్టీ మారుపేరని చెప్పుకునేందుకు కమలనాథులు వాడే స్లోగన్‌. అయితే బీజేపీకి ఇప్పుడు క్రమశిక్షణ విషయంలో క్లారిటీ లేకుండా పోతుందట. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కమలదళానికి ఉహించనివిధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచే ఇబ్బందులు వస్తున్నాయట. సంఘం తరుపున ఉండే ప్రతినిధుల తీరు.. పార్టీ నాయకత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారిందన్న చర్చ బీజేపీలో జోరందుకుందట. పార్టీ నాయకత్వానికి సంఘం ప్రతినిధులకు మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరుగుతోందన్న అభిప్రాయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వ్యక్తమవుతోందట. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటోన్న కమలనాథులకు మొదట సొంతింటిని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయట. అయితే బీజేపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై నోరు విప్పటానికి సైతం చాలామంది నాయకులు భయపడ్తున్నారని సమాచారం. ఒకవైపు పార్టీ నాయకత్వం.. మరోవైపు సంఘం ప్రతినిధులు కావటంతో .. ఏమి మాట్లాడితే . ఏమి జరుగుతుందోనన్న  అభద్రతాభావంలో కమలనాథులు ఉన్నారట.‌


బండి పాదయాత్రపై ప్రభావం ఉంటుందా?

ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ మధ్య గ్యాప్‌ ఏర్పడిందన్న చర్చ ఇలా నడుస్తుండగానే తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర తెరపైకి వచ్చింది. ఈ సమయంలో సంఘం ప్రతినిధులకు, పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూడాలని బీజేపీ జాతీయ నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రతినిధులు హైదరాబాద్‌లో పర్యటించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి.



Updated Date - 2021-08-17T18:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising