ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీడబ్ల్యూసీ నిర్వహణ ప్రొటోకాల్‌పై అధ్యయనం

ABN, First Publish Date - 2021-10-21T09:13:51+05:30

జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహణ ప్రొటోకాల్‌పై అధ్యయనం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్వహణ ప్రొటోకాల్‌పై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏడుగురు సభ్యుల కమిటీ బుధవారం తొలిసారిగా సమావేశమైంది. ఈ నెల 30లోగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో కమిటీ వేగం పెంచింది. బుధవారం కమిటీ చైర్మన్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు అధ్యక్షతన జలసౌధలో సమావేశం జరిగింది. ఇంజనీరింగ్‌ నిపుణుడిగా ఉన్న కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఘన్‌శ్యామ్‌ ఝా, హైడ్రాలజీ కన్సల్టెంట్‌ చేతన్‌ పండిట్‌ లు వర్చువల్‌ విధానంలో పాల్గొనగా.. కన్వీనర్‌, అంతర్రాష్ట్ర విభాగం సీఈ వి. మోహన్‌కుమార్‌, సీఈ శ్రీకాంతరావు, న్యాయసలహాదారు వి.రవీందర్‌రావులు సమావేశానికి హాజరయ్యారు. గెజిట్‌ అమలుచేయాల్సిన రోజునే ప్రభుత్వం ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్‌పై బోర్డులకు అవగాహన లేదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కమిటీ నివేదిక అనంతరం సర్కారు సమగ్ర వివరాలతో కృష్ణా బోర్డుకు లేఖ రాయనుంది. మరోవైపు నివేదిక అందించడానికి 9 రోజులే గడువుంది. ఆ లో గా మరో రెండు సమావేశాలు నిర్వహించి, నివేదికను ఖరారు చేయనున్నారు. 

Updated Date - 2021-10-21T09:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising