ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో 8 అర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయి: డీహెచ్

ABN, First Publish Date - 2021-06-10T00:14:47+05:30

కరోనా నిర్ధారణ కోసం రాష్ట్రంలో 8 అర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయని హైకోర్టుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా నిర్ధారణ కోసం రాష్ట్రంలో 8 అర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయని హైకోర్టుకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలిపారు. మిగతా ల్యాబ్‌‌లకు ఐసీఎంఅర్ నుంచి అనుమతి రాగానే మిగతా అర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తాయని డీహెచ్ పేర్కొన్నారు. హైకోర్టులో వాక్సినేషన్ ప్రక్రియపై జరిగిన విచారణకు డీహెచ్ హాజరై  వివరణ ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారా అని డీహెచ్‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. కమిటీకి సంబంధించి ఫైల్‌ను సీఎస్‌కు పంపించామని, త్వరలో జీఓ విడుదల చేస్తారని హైకోర్టుకు డీహెచ్ తెలిపారు. వారం రోజుల్లో కమిటీకి సంబంధించిన జీఓ విడుదలవుతుందన్నారు.


అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 135  హాస్పిటల్స్‌పై  223 ఫిర్యాదులు అందాయని కోర్టుకు డీహెచ్ తెలిపారు. వాటిలో 22 హాస్పిటల్స్‌కు తిరిగి అనుమతులు ఇచ్చామని డీహెచ్ పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న హాస్పిటల్స్ ఏమైనా స్పందించాయా అని డీహెచ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అధికంగా వసూలు చేసిన హాస్పిటల్స్ తిరిగి పేషెంట్లకు 65 లక్షలు రూపాయలను ఇచ్చాయని డీహెచ్‌ తెలిపారు.



రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన 2.73కోట్ల మందికి వాక్సిన్ ఇవ్వాల్సి ఉందని హైకోర్టుకు డీహెచ్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 41 లక్షల మందికి ఫస్ట్ డోస్ ఇచ్చామన్నారు. 13 లక్షల మందికి సెకండ్ డోస్ ఇచ్చామని ఆయన వివరించారు. జూలై 2కి 17 లక్షల వాక్సిన్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.


రాష్ట్రంలో 30 లక్షల సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించామని, వారికి వాక్సిన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. వారిలో ఏడున్నర లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో 30 ఫంక్షన్ హాల్స్‌ను తీసుకుని వాక్సినేషన్ వేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి రోజు 40 నుంచి 50 వేల వాక్సిన్లు ఇస్తున్నామని హైకోర్టుకు డీహెచ్‌ వివరించారు. 

Updated Date - 2021-06-10T00:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising