ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3800 కోట్లతో 7 మెడికల్‌ కాలేజీలు

ABN, First Publish Date - 2021-05-31T09:02:34+05:30

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంఽధంగా నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు కాలేజీలకు గతంలోనే గ్రీన్‌ సిగ్నల్‌.. కొత్తగా నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు

ఒక్కో దానికి రూ.500 కోట్ల ఖర్చు.. 300 పడకలుంటేనే ఎన్‌ఎంసీ అనుమతి

వైద్య కళాశాలల్లో 150 చొప్పున సీట్లు.. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో మరికొన్ని

ఒక్కో దానికి 500 కోట్లు.. 6 కాలేజీలకు గతంలోనే గ్రీన్‌సిగ్నల్‌

నాగర్‌కర్నూల్‌కు ఓ కాలేజీ మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం


హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంఽధంగా నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. అయితే, తాజాగా ఆదివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో మొత్తం ఏడు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నెల 17న జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్‌ కాలేజీలు (సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా నాగర్‌ కర్నూల్‌లో మరో మెడికల్‌ కాలేజీ రానుంది.


కొత్తగా ఏర్పాటయ్యే ఒక్కో మెడికల్‌ కాలేజీలో 150 చొప్పున మొత్తం 1050 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 2023 విద్యా సంవత్సరం నాటికి ఈ కళాశాలలను ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని తొమ్మిది మెడికల్‌ కాలేజీల్లో 1,615 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఈఎ్‌సఐ మెడికల్‌ కాలేజీలో మరో 100 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా భువనగిరి ఎయిమ్స్‌లో మరో 50 సీట్లు ఉన్నాయి. కొత్తగా వచ్చే సీట్లను కలుపుకొంటే మొత్తం సంఖ్య 2,815కు పెరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 23 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండగా, వాటిలో 3,350 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. కొత్తగా వచ్చే వాటితో కలిపి ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 41 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 6,165కు పెరగనుంది. 


అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే..

రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా నాలుగు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. మహబూబ్‌నగర్‌ (150సీట్లు), సిద్దిపేట (175), నల్లగొండ (150), సూర్యాపేట (150)లో కాలేజీలు ప్రారంభమయ్యాయి. వీటి తర్వాత కేంద్రం ఆధ్వర్యంలో ఈఎ్‌సఐ, బీబీనగర్‌ ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీలు వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే మరో ఆరు కాలేజీల ఏర్పాటుకు నిర్ణయించింది. ఒక్క మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలంటే రూ.500 కోట్లు ఖర్చవుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దానికి అనుబంధంగా ఏర్పాటయ్యే నర్సింగ్‌ కాలేజీకి రూ.50 కోట్లు ఖర్చు కానుంది. వెరసి ఒక్కో కాలేజీకి రూ.550 కోట్లు ఖర్చు అవుతుంది. జగిత్యాలలో ఇప్పటికే నర్సింగ్‌ కాలేజీ ఉన్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆరు మెడికల్‌ కాలేజీలకు మొత్తం రూ.3250 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఆ మేరకు డీపీఆర్‌ సిద్ధం చేసి సర్కారుకు పంపారు. అయితే నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఏర్పాటు కానున్న మెడికల్‌ కాలేజీకి డీపీఆర్‌ సిద్ధం చేయాల్సి ఉంది. దీన్ని కూడా కలిపితే మొత్తం వ్యయం రూ.3800 కోట్లు కానుంది. 

 

భూసేకరణకు స్థలాల పరిశీలన

కొత్తగా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే కనీసం 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అవసరం. అది కూడా కనీసం రెండేళ్ల నుంచి నడుస్తుంటేనే నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇస్తుంది. అయితే స్థలం విషయంలో గతంలోలా 20 ఎకరాలు కాకుండా.. మారిన నిబంధనల ప్రకారం ఐదు ఎకరాల స్థలం ఉంటే చాలు. కాగా, కొత్త కాలేజీలన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేయనుండటంతో భూసేకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొన్ని చోట్ల అధికారులు స్థలాలను కూడా పరిశీలించారు. కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రతి 100-150 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉంటుంది. 

Updated Date - 2021-05-31T09:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising