ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఖాతాల్లో 516.95 కోట్లు జమ

ABN, First Publish Date - 2021-06-16T09:34:56+05:30

రైతుబంధు పథకం కింద మంగళవారం తొలిరోజు రూ.516.95 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు రెండెకరాల లోపు ఉన్నవారికి: నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకం కింద మంగళవారం తొలిరోజు రూ.516.95 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎకరంలోపు భూమి ఉన్న 16,95,601 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో వీటిని జమ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా తొలిరోజు రాష్ట్రంలో 10,33,915 ఎకరాలకు పెట్టుబడి సాయం అందిందని తెలిపారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,11,970 మంది రైతుల ఖాతాల్లో రూ.36.10 కోట్లు, అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 9,628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు జమ చేసినట్లు చెప్పారు. ఇక బుధవారం రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండెకరాల లోపు భూమి ఉన్న రైతులు 15.07 లక్షల మంది ఉన్నారని, వీరికి రూ.1152.46 కోట్లు సాయం అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-06-16T09:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising