ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీశాఖలో మహిళలకు 33% ఉద్యోగాలు

ABN, First Publish Date - 2021-03-09T08:44:09+05:30

అటవీశాఖలో మహిళలకు 33ు ఉద్యోగాలు కల్పించాలని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌

హైదరాబాద్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): అటవీశాఖలో మహిళలకు 33ు ఉద్యోగాలు కల్పించాలని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సూచించారు. మిగతా రంగాల మాదిరిగానే క్షేత్ర స్థాయిలో అడవుల్లో పనిచేేసందుకు మహిళలు ముందుకురావడం ఆహ్వనించదగిన పరిణామమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఐఎ్‌ఫఎస్‌ అధికారుల వివరాలతో కూడిన ‘గ్రీన్‌ క్వీన్స్‌ ఆఫ్‌ ఇండియా-నేషన్స్‌ ప్రైడ్‌’ అనే పుస్తకాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ అటవీశాఖలో దాదాపు 30ు మంది మహిళలు పనిచేస్తున్నారనే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ అటవీశాఖను ఆయన అభినందించారు. కాగా, జీవవైవిధ్య పరిరక్షణలో మహిళలే కీలకపాత్ర పోషిస్తున్నారని శోభ అన్నారు. మహిళలు అడవుల్లో ఉద్యోగం చేయడం తెలికైన పనికాదని ఆమె చెప్పారు. జాతీయ జీవవైవిధ్య మండలి చైర్మన్‌ వీబీ మాథూర్‌ అధ్యక్షతన ఆన్‌లైన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో శోభ పాల్గొని మాట్లాడారు. 

Updated Date - 2021-03-09T08:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising