16 గంటల చాకిరీ.. ఆలస్యంగా వేతనాలు
ABN, First Publish Date - 2021-07-27T08:47:44+05:30
‘‘చట్ట విరుద్ధంగా రోజుకు 12 నుంచి 16 గంటల వరకు పని చేయిస్తున్నారు.. కండక్టర్, డ్రైవర్లతో హమాలీ, కూలీ పనులు చేయిస్తున్నారు..
కార్మిక కమిషనర్‌కు ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ‘‘చట్ట విరుద్ధంగా రోజుకు 12 నుంచి 16 గంటల వరకు పని చేయిస్తున్నారు.. కండక్టర్, డ్రైవర్లతో హమాలీ, కూలీ పనులు చేయిస్తున్నారు.. మహిళా కండక్టర్లచేత బస్సులు ఊడిపిస్తున్నా రు’’ అంటూ టీఎస్‌ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం కార్మిక శాఖ కమిషనర్ చతుర్వేదికి ఫిర్యాదు చేసింది. కార్మికుల సమస్యలపై జేఏసీ ఛైర్మన్ కె.రాజిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం కార్మికశాఖ కమిష నర్‌ని కలిసింది. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కె.రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలో వేతనాల చట్టం అమలు చేయడం లేదని, జీతాలు 15-20 తేదీలకు చెల్లిస్తున్నారని అన్నారు. భవిష్యనిధి పేరుతో కార్మికుల నుంచి వసూలు చేసిన రూ.1405 కోట్లను ప్రభుత్వం వాడుకుందని, కార్మికుల సామా జిక భద్రత కోసం కార్మికుల నుంచి క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీకి వసూలు చేసిన 934 కోట్లను కూడా సీసీఎస్‌కి చెల్లించలేదన్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ప్రభుత్వం అందించడం లేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ కె.హన్మంత్ ముదిరాజ్, నాయకులు వీఎస్.రావు, పి.కమాల్ రెడ్డి, పి.రమేశ్ కుమార్, జి.అబ్రహాం, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-27T08:47:44+05:30 IST