ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బడ్జెట్‌లో బీసీలకు 10 వేల కోట్లు కేటాయించాలి’

ABN, First Publish Date - 2021-03-05T11:59:49+05:30

ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో బీసీలకు 10వేల కోట్లు కేటాయించేలా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాంనగర్‌ : ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో బీసీలకు 10వేల కోట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నాయకత్వంలో ఆ సంఘం నేతలు గురువారం వినతిపత్రం ఇచ్చారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల 18న ప్రారంభం కానున్న వార్షిక బడ్జెట్‌ సమావేశాల్లో బీసీలకు గతంలో చేసిన అన్యాయం, మరోసారి చేయకుండా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో మాట్లాడి జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు 5 వేల కోట్లు, ప్రతి నియోజకవర్గానికి రెండు గురుకుల పాఠశాలల చొప్పున 240 గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, ఉదయ్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, చంటి ముదిరాజ్‌, లక్ష్మణ్‌యాదవ్‌, జశ్వంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T11:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising